ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : రేపే 'పఠాన్' డిజిటల్ ఎంట్రీ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 11:16 AM

ఫైనల్లీ.. బాలీవుడ్ బాక్సాఫీస్ ని గత రెండున్నర నెలలుగా నిరంకుశంగా పాలిస్తున్న "పఠాన్" మూవీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో పఠాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతుంది.


సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్గా నటించారు. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తొలి 500 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. హిందీలో బాహుబలి కలెక్షన్లను క్రాస్ చేసి, అందరి చేత ఔరా ! అనిపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa