గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "శాకుంతలం". పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
తాజాగా ఈ రోజు శాకుంతలం చిత్రబృందం సినిమాలో కీలక పాత్రను పరిచయం చేసింది. దేవాధిపతి, శకుంతల- దుశ్యంతుల కథలో కీలకపాత్ర పోషించే 'ఇంద్రుడు' యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాత్రను సినిమాలో జిష్షు సెన్ గుప్త పోషించారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో, శాకుంతలం చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ని రివీల్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa