వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "కస్టడీ". అక్కినేని నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుని, ప్రస్తుతము పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
తాజాగా ఈ రోజు సాయంత్రం 06:49 నిమిషాలకు కస్టడీ నుండి మేజర్ అప్డేట్ రాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. మరి, ఇది టీజర్ రిలీజ్ అప్డేట్ అన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa