ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : ఫ్యాన్ బాయ్ విశ్వక్ కోసం తారక్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 03:10 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా "దాస్ కా ధమ్కీ". వణ్మయి క్రియేషన్స్ , VS సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. ధమ్కీ ట్రైలర్ 2.ఓ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..  మార్చి 17న జరగబోయే ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని... విశ్వక్కే స్వయంగా ఈ న్యూస్ ని ప్రకటించారు.     


ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 22న ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa