ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొన్నియిన్ సెల్వన్ 2 పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 04:51 PM

కోలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లెజెండరీ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ హై బడ్జెట్ మల్టీస్టారర్ లో చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ్ల, ప్రభు ప్రధానపాత్రల్లో నటించారు. AR రెహమాన్ సంగీతం అందించారు.


పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ ని పెంచుతున్నారు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాను రివైండ్ చేస్తూ చిన్న వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోను బట్టి పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 ని చూడాల్సిన అవసరమే లేదని, పార్ట్ 2 దానంతట అదే ఒక ఇండిపెండెంట్ ఫిలిం అని, పార్ట్ 1 ని కూడా చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa