వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "సార్ / వాతి". ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మంచి మౌత్ టాక్ తో ఇరు భాషల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది.
లేటెస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్రకారం, సార్/వాతి మూవీని స్కూల్ పిల్లలకు ఉచితంగా ప్రదర్శించబోతున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. విద్య యొక్క విలువను, గొప్పతనాన్ని చాటిచెప్పడమే ఈ సినిమా యొక్క మేజర్ గోల్. స్కూల్ పిల్లలకు ఉచితంగా సినిమా ప్రదర్శన చేసేందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అనుమానాలు ఉన్నా, వివరాలు తెలుసుకోవాలన్నా.. తమ టీం ను అప్రోచ్ అవ్వమని నాగవంశీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa