ఓహ్ బేబీ తదుపరి దర్శకురాలు బీవీ నందినీరెడ్డి రూపొందిస్తున్న చిత్రం "అన్నీ మంచి శకునములే".ఇందులో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్నారు.
మార్చి 4వ తేదీన ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా నుండి ఒక్కొక్క కీలకపాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా హీరో సంతోష్ శోభన్ ని రిషి గా పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్లో రిషి తన డార్లింగ్ కి కాళ్ళు నొక్కుతూ కనిపిస్తున్నారు. డార్లింగ్ ఎవరంటే.. సీనియర్ నటీమణి షావుకారు జానకి గారు.
వేసవికి చల్లని చిరుగాలి..అంటూ ఆడియన్స్ లో మాంచి ఫీల్ గుడ్ ఇమేజ్ ని సంపాదించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా నుండి రేపు రాబోతున్న టీజర్ అందుకు తగ్గట్టుగా ఉంటుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa