నాచురల్ స్టార్ నాని హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో విపరీతంగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ నెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ గా ఉంది.
ఒకపక్క తెలుగులో ముమ్మర ప్రచారం నిర్వహిస్తూనే దసరా చిత్రబృందం కోలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమాకు అన్ని భాషల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేందుకు చిత్రబృందం కష్టపడుతుంది. ఈ మేరకు నిన్న చెన్నై SRM యూనివర్సిటీ యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ లో నాని పాల్గొన్నారు. దీంతో అక్కడ వాతావరణమంతా ఎలక్ట్రిఫయింగ్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa