కృష్ణవంశీ దర్శకత్వంలో 21వ సినిమాగా రూపొందుతున్న "రంగమార్తాండ" నుండి కాసేపటి క్రితమే థర్డ్ సింగిల్ 'పువ్వై విరిసే ప్రాణం' లిరికల్ వీడియో విడుదలయ్యింది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు స్వరపరచి, స్వయంగా ఆలపించిన ఈ పాటకు లేట్ లెజెండరీ లిరిసిస్ట్ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు జీవితపాఠాలను సాహిత్యంగా అందించారు. మెలోడియస్ మ్యూజిక్ తో చక్కని పాఠం వింటున్నట్టుగా ఒక మంచి ఫీలింగ్ ఇస్తున్న ఈ పాట ఐకానిక్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయా భరద్వాజ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa