యంగ్ హీరో, రీసెంట్గానే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్తచిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్గా విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి హార్ట్ టచింగ్ రెస్పాన్స్ రాగా, తాజాగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు 'కనుల చాటు మేఘమా' అని సాగే బ్రేకప్ ఘజల్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa