రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘రాజా డీలక్స్’ కూడా చేస్తున్నారు. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోన్న ప్రభాస్, ఈసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా వారితో ప్రభాస్ చేయబోయే సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.