కన్నడ చిత్రపరిశ్రమ నుండి రాబోతున్న మరొక ప్రతిష్టాత్మక పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ "కబ్జా". ఉపేంద్ర, సుదీప్ మల్టిస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
కన్నడతో పాటుగా మరో ఆరు భాషలలో మార్చి 17న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో స్టార్ హీరో నితిన్ సొంత సంస్థ రుచిర ఎంటర్టైన్మెంట్స్, N సినిమాస్ విడుదల చెయ్యబోతుంది. నితిన్ తండ్రి N సుధాకర్ రెడ్డి సమర్పిస్తున్నారు.
R. చంద్రు డైరెక్షన్లో పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆర్ చంద్రునే నిర్మిస్తున్నారు. అలంకార్ పాండియన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa