కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో తలపతి 67 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మాస్టర్ కలయికలో రాబోతున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై చాలా మంచి అంచనాలున్నాయి. 7స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో కీరోల్స్ పోషిస్తున్న క్యాస్ట్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చిన మేకర్స్ యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ సినిమాలో భాగమే అని సరికొత్త ప్రకటన చేసారు. ఈ మేరకు గతంలోనే ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, శాండీ, గౌతమ్ మీనన్, మ్యాథ్యు థామస్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్ కీలకపాత్రలు పోషిస్తున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa