ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన "కేజీఎఫ్" ఫ్రాంచైజీతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసిన శ్రీనిధి శెట్టి తొలి సినిమాకే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆపై విక్రమ్ "కోబ్రా" రూపంలో ఎదురుదెబ్బ తగలడంతో స్క్రిప్ట్స్ విషయంలో ఆచూతూచి అడుగులేస్తోంది.
ఈ నేపథ్యంలో శ్రీనిధి శెట్టికి ఒక క్రేజీ టాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ భామ జత కట్టబోయేది యంగ్ హీరోతో కాదు... సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గారితో.
వెంకటేష్ గారి 75వ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని వినికిడి. ఈ ప్రాజెక్ట్ కు హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరిస్తారంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa