టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరువీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమాలోని ఐదవ మరియు చివరి పాట అయినా నీకేమో అందమెక్కువా పాటని హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజీలో విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ సాంగ్ ని మీకా సింగ్, గీతా మాధురి మరియు డి వెల్మురుగన్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా హుక్ లైన్ ఈ పాటను అద్భుతమైన హిట్‌గా మార్చింది.
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa