ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటేష్ 75వ సినిమాపై క్రేజీ బజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 06:34 PM

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల 'ఎఫ్3'తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. ఇటీవల విడుదలైన విశ్వక్ సేన్ యొక్క 'ఓరి దేవుడా' సినిమా లో కూడా అతిధి పాత్రలో కనిపించరు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ యొక్క 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌' లో మరో స్పెషల్ రోల్ ని చేస్తున్నాడు, ఈ సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది.


తాజాగా ఇప్పుడు వెంకటేష్ తన 75వ చిత్రాని హిట్ దర్శకుడు శైలేష్ కొలనుతో చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందని లేటెస్ట్ టాక్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని సమాచారం. ఇంకా ఈ సినిమాపై ఎలాంటి ప్రకటన  రానప్పటికీ ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa