టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా, మురళి కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ "వినరో భాగ్యము విష్ణుకథ". గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చెయ్యడానికి మేకర్స్ ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఈ మేరకు రేపు ఉదయం తొమ్మిదిన్నర నుండి హైదరాబాద్ లోని PVR RK సినీప్లెక్స్ స్క్రీన్ 2 లో VBVK టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
పోతే, ఈ మూవీ వచ్చే నెల 17వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa