ఏజెంట్ గోపి గా నటించి, గూఢచారి రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు యంగ్ హీరో అడివిశేష్. శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలయ్యింది.
తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2/ G 2 తెరకెక్కించబోతున్నారు శేష్. ఈ మేరకు కొంతసేపటి క్రితమే జి 2 ప్రీ విజన్ వీడియో విడుదలైంది. ఈ వీడియో ఐతే, జి 2 స్టన్నింగ్ విజువల్స్ తో గ్రాండ్ గా తెరకెక్కబోతుందని, ఏజెంట్ గోపి ఇంటెర్నేషల్ లెవెల్ విషయాలను స్పై చెయ్యబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి ప్రీ విజన్ వీడియోతో జి 2 అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ అతిత్వరలోనే ప్రారంభం కానుందని చిత్రబృందం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa