ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీల్ గుడ్ విలేజ్ మెలోడీగా "బుట్టబొమ్మ" ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 05:01 PM

 


చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ హిట్ చిత్రాలలో నటించిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం "బుట్టబొమ్మ". మలయాళ సూపర్ హిట్ మూవీ "కప్పేల" కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు.
 
తాజాగా ఈ సినిమా నుండి 'వినోదంలో కథేముందో' అనే ఫీల్ గుడ్ విలేజ్ మెలోడీని మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ పాటను స్వీకర్ అగస్తి స్వరపరచగా, మోహన భోగరాజు ఆలపించారు. భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు.


సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ సినిమా ఈ నెల 26న విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa