'ఓరి దేవుడా' సూపర్ హిట్ తదుపరి యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం "ధమ్కీ". ఈ సినిమాకు ఆయనే డైరెక్షన్ చేస్తుండగా, నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని లేటెస్ట్ బజ్ నడుస్తుంది. అలానే ఆ సీక్వెల్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని టాక్. మరైతే, ఈ విషయాలపై చిత్రబృందం నుండి అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
వణ్మయి క్రియేషన్స్, VS సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ధమ్కీ వచ్చే నెల 17న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa