కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "వారిసు". ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
తెలుగులో ఈ సినిమాను "వారసుడు" టైటిల్ తో సంక్రాంతి కానుకగా తీసుకురాబోతున్నాం అని నిన్నటివరకు చిత్రబృందం ప్రచారం చెయ్యగా, తాజాగా ఈ రోజు కొంతసేపటి క్రితమే వారసుడు తెలుగు ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు మాట్లాడుతూ.. వారసుడు సినిమాను జనవరి 14న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాం... అని పేర్కొంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, సంగీత, శామ్, ప్రభు కీరోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa