'అన్నాత్తె' డిజాస్టర్ తదుపరి తలైవా రజినీకాంత్ నటిస్తున్న సినిమా "జైలర్". నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రమ్యకృష్ణ, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో కన్నడ 'కరునాడ చక్రవర్తి' శివరాజ్ కుమార్ గారు ఒకముఖ్యపాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మరొక ముఖ్యపాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు జైలర్ సెట్స్ నుండి మోహన్ లాల్ స్టిల్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ పోస్టర్ లో మోహన్ లాల్ ఎంతో ప్రశాంతం గా కనిపిస్తున్నప్పటికీ దేనికోసమో అన్వేషిస్తున్నట్టు కనిపిస్తున్నారు.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa