కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "ది ఘోస్ట్". నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర LLP సంయుక్త బ్యానర్ లపై నిర్మింపబడిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆపై డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఘోస్ట్ కు అక్కడ కూడా చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదు.
తాజా సమాచారం ప్రకారం, ఈ ఆదివారం అంటే జనవరి 8వ తేది సాయంత్రం ప్రముఖ బుల్లితెర ఛానెల్ స్టార్ మా లో ఘోస్ట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రాబోతుందని తెలుస్తుంది. మరి, బుల్లితెర ప్రేక్షకుల నుండి ఘోస్ట్ కు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa