ధమాకా మూవీతో మాస్ మహారాజ రవితేజ సూపర్ హిట్ కొట్టాడు. డిసెంబర్ 23న రిలీజైన ఈ చిత్రం 9 రోజుల్లో రూ.77 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో రవితేజ ఇవాళ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘ధమాకా లాంటి మరిచిపోలేని సినిమాతో 2022కు వీడ్కోలు చెప్పాం. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ విజయాన్ని 2022లో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం ఇస్తున్నా. 2022 ఎంతో కష్టంగా గడిచింది. 2023లో అంతా మంచే జరగాలి.’ అని పోస్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa