నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "వీరసింహారెడ్డి". సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లిరికల్ సాంగ్స్, మేకింగ్ వీడియోస్, పవర్ఫుల్ పోస్టర్స్... ఇలా.. వీరసింహారెడ్డి హంగామా మాములుగా లేదు.
తాజాగా వీరసింహారెడ్డి ఔట్ డోర్ ప్రమోషన్స్ ని కూడా ముమ్మరం చేసిందని తెలుస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్లో వీరసింహారెడ్డి మాస్సివ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. అందునా.. ఈ ఫ్లెక్సీలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించినవి కావడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ మేరకు జనవరి 6వతేది సాయంత్రం ఆరు గంటల నుండి ఒంగోలు ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్ లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఐతే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మైత్రి సంస్థ నుండి ఇంకా రాకపోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa