మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా, ఎన్. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం రీసెంట్గానే ప్రారంభమయ్యింది. వైష్ణవ్ తేజ్ కెరీర్ లో నాల్గవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా 'PVT 04' వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్, మాస్ అండ్ ఇంటెన్స్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ చిత్రబృందం సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మేరకు PVT 04 సినిమా ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa