కోలీవుడ్ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'పొన్నియిన్ సెల్వన్' సెప్టెంబర్ నెలలో విడుదలై పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆపై డిజిటల్ ఎంట్రీ చేసి అక్కడ కూడా ఎనలేని కీర్తిని గడించిన PS 1 తాజాగా బుల్లితెర సందడికి రెడీ అయ్యింది. ఈ మేరకు సన్ టీవీ ఛానెల్ లో ఈ ఆదివారం అంటే జనవరి 8వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు PS 1 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది.
మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధానపాత్రల్లో నటించారు. AR రెహ్మాన్ సంగీతం అందించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa