నాచురల్ స్టార్ నాని నుండి ఈ రోజు 30వ సినిమా ఎనౌన్స్మెంట్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చింది. ఈ మేరకు జనవరి 1తేదీ సాయంత్రం 04:05 నిమిషాలకు నాని 30వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఐతే, తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో నానికి జోడిగా బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించబోతుందని తెలుస్తుంది.ఆ అలానే ఈ ప్రాజెక్ట్ ను కొత్త డైరెక్టర్ రూపొందించబోతున్నారని, మలయాళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
మరి, ఈ ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న క్రేజీ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే, ఆదివారం వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa