ఈ రోజు సాయంత్రం విడుదలైన మెగామాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన కాసేపట్లోనే 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 148 కే లైక్స్ తెచ్చుకుంది. మెగామాస్ ఊరమాస్ స్టెప్స్ కి అభిమానులు స్క్రీన్ కి కళ్లప్పజెప్పేసారంటే నమ్మండి.
బాబీ కొల్లి డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రుతిహాసన్ జంటగా నటించారు. మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. రాక్ స్టార్ DSP సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa