ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి ని లాక్ చేసిన త్రిష 'రంగి'

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 07:39 PM

శరవణన్ దర్శకత్వంలో చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'రంగి' అనే టైటిల్ ని లాక్ చేసారు. చాలా కాలంగా రూపొందుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయినట్లు మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సన్ ఎన్‌ఎక్స్‌టి సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్ ని సన్ టీవీ సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


ఈ చిత్రంలో అనశ్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సి సత్య సంగీతం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కథను అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa