ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్ వేద' డిజిటల్ ఎంట్రీకి టైం ఫిక్స్..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 07:23 PM

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'విక్రమ్ వేద'. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రంవేద కు ఈ సినిమా అఫీషియల్ హిందీ రీమేక్. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రీలే హిందీలో కూడా తెరకెక్కించారు. ఈ సినిమాలో రాధికా  ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన విక్రంవేదకు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్లు పెద్దగా వచ్చినట్టు లేవు. తాజాగా విక్రంవేద న్యూ ఇయర్ లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు జనవరి 9 నుండి వూట్ సెలెక్ట్, జియో సినిమా ఓటిటీలలో విక్రంవేద స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. మరి, అతి త్వరలోనే సదరు ఓటిటి సంస్థల నుండి ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa