నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ టాక్ షో తో తెలుగు డిజిటల్ రంగానికి రారాజుగా మారిపోయారు. సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, కొంటెతనం, ఇతరులను సౌకర్యంగా ఉంచడం, టేక్ ఇట్ ఈజీ విధానం...ఇలా తనలోని ఎన్నో కొత్త కోణాలను ఈ షో ద్వారా అభిమానులకు చూపించి, తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. అన్స్టాపబుల్ టాక్ షోని ఒంటి చేత్తో విజయవంతంగా నడుపుకొస్తున్నారు.
తాజాగా ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. శుక్రవారం ఈ ఎపిసోడ్ యొక్క షూటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, బాలయ్య చిన్న కూతురు తేజస్విని పవన్ కి వీరాభిమాని అనే ఒక టాక్ బయటకు వచ్చింది. అన్స్టాపబుల్ సెట్స్ లో తేజస్విని కనిపించడమే ఇందుకు కారణం.
ఐతే, తేజస్విని అన్స్టాపబుల్ షోకి క్రియేటివ్ హెడ్ మరియు..బాలయ్య కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆమె దగ్గరుండి చూసుకుంటారు. ఈ కారణంగానే ఆమె అన్స్టాపబుల్ సెట్స్ లో ఉన్నారు అని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa