వృద్ధాప్య సమస్యల కారణంగా ఈ రోజు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు టాలీవుడ్ సీనియర్ నటులు శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు పరమపదించారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ మరొక లెజెండరీ నటుడిని దూరం చేసుకున్నట్టయ్యింది. రీసెంట్గానే రోజుల వ్యవధిలో టాలీవుడ్ సీనియర్ హీరోలు కృష్ణంరాజుగారు, కృష్ణ గారు మరణించిన విషయం తెలిసిందే. కైకాల గారి ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.
ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కైకాల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ప్రత్యేక పోస్ట్ ను విడుదల చేసారు. సత్యనారాయణ గారిని నవరస నటనాసార్వభౌములనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని, ఎందుకంటే, ప్రతినాయక పాత్రలను ఎంత అవలీలగా పోషించారో...అదేవిధంగా కరుణారసభరిత పాత్రలలోనూ కైకాల గారు ఒదిగిపోయి.. ప్రేక్షకులను విశేషంగా మెప్పించారని పేర్కొన్నారు. నిర్మాతగానూ మంచి చిత్రాలను అందించారని, లోక్ సభ సభ్యుడిగా ప్రజాజీవితంలో ఉన్నారని, తెలుగుదనం మూర్తీభవించిన కైకాల గారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిదని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa