సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో కలిసి ఈ రోజు ఉదయం ఫారిన్ ట్రిప్ కి వెళ్లారు. ఈ మేరకు మహేష్ అండ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ లో హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో క్రిస్మస్ & న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను మహేష్ అండ్ ఫ్యామిలీ విదేశాలలో సెలెబ్రేట్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఫస్ట్ షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా న్యూ ఇయర్ లో న్యూ షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యనుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa