తెలుగు చలనచిత్ర పరిశ్రమకున్న విలక్షణ నటుల్లో నవరస నటనా సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారు అగ్రగణ్యులు. దురదృష్టవశాత్తు.. ఈ రోజు కైకాల గారు తెలుగు చలనచిత్రపరిశ్రమకు అందనంత దూరం వెళ్లిపోయారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కైకాల గారు ఆఖరి శ్వాస విడిచారు. కైకాల గారి ఆకస్మిక మృతిపట్ల తెలుగు పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, రేపు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కైకాల గారి అంత్యక్రియలను తెలంగాణా ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుందని తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa