టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'వాసవ సుహాస' సాంగ్ యొక్క ప్రోమో విడుదలైంది. ఆ విష్ణునాధుని వైభవాన్ని తెలిపే ఈ పాట డివోషనల్ గా సాగనుంది. ఈ పాటను కారుణ్య ఆలపించగా, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 06:19 నిమిషాలకు రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa