అడివిశేష్ హీరోగా నటించిన "హిట్ 2" సినిమా రీసెంట్గానే థియేటర్లలో విడుదలై, సంచలన విజయం సాధించింది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను పేరు ఇండస్ట్రీ మొత్తం మారు మోగిపోయింది. గతంలో హిట్, ఇప్పుడు హిట్ 2 ... రెండు సినిమాలతో సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీనియర్ హీరో వెంకటేష్ గారి పేరు తెరపైకి వచ్చింది. శైలేష్ - వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతుంది. శైలేష్ వెంకీ మామకు ఒక స్టోరీ లైన్ వినిపించడం, ఆయన చేత ఓకే అనిపించుకోవడం... జరిగిందట. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుందట.
ఒకవేళ శైలేష్ వెంకటేష్ ల సినిమా లైన్లోకి వస్తే, నాని "హిట్ 3" ఇంకాస్త ఆలస్యం అవుతుందేమో..!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa