మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును రేసెంట్గనే ఎనౌన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. వెంకటేష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సహనిర్మాణసంస్థలుగా వ్యవహరిస్తున్నాయి.
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చెర్రీ ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలోకి రాగా, ఇప్పుడందరూ బుచ్చిబాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, రాంచరణ్ బుచ్చిబాబుల సినిమా 2023ద్వితీయార్ధంలో మొదలవ్వొచ్చని అంటున్నారు. జూలై లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం జరుగుతుందట.
ప్రస్తుతానికైతే, ఈ సినిమా ప్రీ విజువలైజ్డ్ గ్రాఫిక్స్ వెర్షన్ తయారవుతుంది. దీనిని బట్టి మూవీ బడ్జెట్ ఫిక్స్ చేసుకుని, ఆపై నటీనటుల సెలక్షన్ జరుగుతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa