తమిళహీరో విజయ్ తో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "వారిసు". తెలుగు ప్రేక్షకులను "వారసుడు" గా పలకరించబోతుంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో పొంగల్ 2023 కానుకగా విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి ఫుల్ ఆల్బమ్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా... మూడు పాటలకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో శ్రోతలు వారిసు ఆడియో ఆల్బమ్ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa