ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి టార్గెట్ గా ప్రభాస్ - మారుతీ సినిమా..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 01:18 PM

ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసి, సైలెంట్గా షూటింగ్ కానిచ్చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ మారుతిల సినిమా నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకున్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ లో హాట్ టాపిక్ అంశం ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మారుతీ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారని టాక్.


ఇప్పటివరకు ఎనిమిది రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుని, డిసెంబర్ 24 నుండి న్యూ షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యబోతున్న ఈ సినిమా సంక్రాంతి 2024 విడుదల టార్గెట్ గా పని చేస్తుందని తెలుస్తుంది. పోతే, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa