కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధానపాత్ర పోషిస్తున్న తమిళ చిత్రం "కనెక్ట్". అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ తెలుగులో అదే టైటిల్ తో విడుదల కాబోతుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తుంది. పోతే, ఈ గురువారం అంటే ఈ నెల 22న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న కనెక్ట్ కు సెన్సార్ బృందం యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రన్ టైం వచ్చేసి ఒక గంటా 39నిమిషాలని తెలుస్తుంది. వెరీ క్రిస్పీ రన్ టైం ను లాక్ చేసుకున్న ఈ హార్రర్ ఫ్లిక్ థియేటర్ ఆడియన్స్ ను ఏమేరకు భయపెట్టగలదో ...చూద్దాం..!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa