రీసెంట్గా విడుదలైన ట్రైలర్ తో ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న సినిమా "18 పేజెస్". ఇందులో నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ సినిమాకు కథను అందించారు. పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో డిఫరెంట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గానే సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా రన్ టైం పై క్లారిటీ వస్తుంది. 2 గంటల 17 నిమిషాల డీసెంట్ రన్ టైం తో ఆడియన్స్ ను వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa