ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రోజుల్లో 3600 కోట్లు వసూలు చేసిన అవతార్ 2!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 12:48 PM
జేమ్స్ కామరూన్‌ విజువల్‌ వండర్‌ అవతార్‌ గతవారం ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదలైంది. కథ, కథనం విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ వసూళ్లలో ఈ చిత్రం భారీ రికార్డులను నమోదు చేసింది. 3 రోజుల్లోనే సుమారు రూ. 3600 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు 3 రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’ మొత్తం కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసి సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి వారాంతంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 131–133 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ సినిమా మొత్తంగా రూ.126 కోట్ల కలెక్షన్లతో ఇండియాలో అత్యధికంగా వసూలు చేసిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆ రికార్డును‘అవతార్2’ మూడు రోజుల్లోనే బ్రేక్ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa