ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ "తంగలాన్" పై లేటెస్ట్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 03:24 PM

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలు కోబ్రా, పొన్నియిన్ సెల్వన్ 1 రాగా, వాటిలో PS 1 పాన్ ఇండియా సూపర్ హిట్ అయ్యింది. ఆయన నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తంగలాన్". ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ఈ సినిమా గురించి గత నెలలో అధికారిక ప్రకటన జరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఈ రోజు ఒక స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈ రోజు తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ పుట్టినరోజు కావడంతో, చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా విడుదలైన ఈ పోస్టర్ లో విక్రమ్, పా రంజిత్ ఒకరినొకరు చూసుకుంటూ కనిపిస్తారు.


స్టూడియో గ్రీన్ మరియు నీలం ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై KE జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రకాష్ కుమార్ జీవీ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa