ప్రముఖ సినీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గీతా దేవి (80) కన్నుమూశారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. గీతాదేవి గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, గురువారం ఉదయం 8.30 గంటలకు మరణించారని మనోజ్ బాజ్‌పాయ్ ప్రతినిధి తెలిపారు. గీతాదేవికి మరో ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత సంవత్సరం నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి ఆర్‌కె బాజ్‌పాయ్ కన్నుమూసిన విషయం తెలిసిందే.