ప్రముఖ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం గమనార్హం. చికిత్సతో దీన్ని విజయవంతంగా అధిగమించిన హంసానందిని సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. తాజాగా ఓ సినిమా షూటింగ్ కు హాజరైన ఆమె తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించింది. ‘‘సెట్లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు. ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను తిరిగి వచ్చేశా’’ అని పోస్ట్ పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa