మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "ధమాకా" నుండి ఈ రోజు ఉదయం "దండకడియాల్" అనే ఫాస్ట్ బీస్ట్ సాంగ్ విడుదలైంది. భీమ్స్ స్వరపరిచిన ఈ పాటను సాహితి చాగంటితో కలిసి ఆయనే ఆలపించారు. లిరిక్స్ కూడా ఆయనే రాసారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఇక సాంగ్ విషయానికొస్తే, మాస్ రాజా అభిమానులు కోరుకునే ఫుట్ టాప్పింగ్ ట్యూన్, క్యాఛీ లిరిక్స్, అమేజింగ్ స్టెప్స్ తో ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలవనుంది.
ఈ సినిమాకు డైరెక్టర్ నక్కిన త్రినాధరావు కాగా,శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈనెల 23న ధమాకా సినిమా థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa