తెలుగమ్మాయి చాందిని చౌదరి ఈ రోజు తన కొత్త సినిమాను ప్రకటించింది. సి స్పేస్ ప్రొడక్షన్ హౌస్ లో ప్రొడక్షన్ నెంబర్ . 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాందిని లీడ్ రోల్ లో నటిస్తుంది. ప్రకాష్ దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో కం సపోర్టింగ్ ఆర్టిస్ట్ నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ రోజే ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం లాంఛనంగా జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa