కోలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్ డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన సినిమా లవ్ టుడే. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పోతే, ఈ చిత్రం నవంబర్ 25న ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో రీసెంట్గా రిలీజైన ట్రైలర్ యూట్యూబులో దుమ్ము రేపుతోంది. ఇప్పటివరకు 1. 5 మిలియన్ వ్యూస్ ను రాబట్టిన ఈ ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది.
ప్రదీప్ రంగనాధన్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa