నటకిరీటి రాజేంద్రప్రసాద్, ఇంద్రసేనా, ఐశ్వర్యా రాజ్, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం శాసనసభ. సాప్బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై షణ్ముగం సప్పని, తులసీరామ్ సప్పని నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా కొంతసేపటి క్రితమే ఈ మూవీ నుండి పొలిటికల్ యాంథెం 'సరిహద్దులు లేవురా' లిరికల్ సాంగ్ విడుదలయ్యింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. కిన్నల్ రాజ్, రవి బస్రుర్ లిరిక్స్ అందించారు. వినే శ్రోతల్లో అగ్గి రాజేసే విధంగా, ఎంతో పవర్ఫుల్ గా ఉంది ఈ పాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa